రాజ్ తరుణ్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో సమస్యలు. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై చాలా ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక సినిమా కెరీర్ కూడా అంత సక్సెస్ ఫుల్ గా లేదు. ఆయనకి హిట్ పడి చాలా కాలమైయింది. ఆయన నుంచి సినిమాల సంఖ్య కూడా తగ్గింది. అయితే ఇలాంటి దశలో వారం వ్యవధిలో రాజ్ తరుణ్ నటించి రెండు సినిమాలు విడుదల రెడీ కావడం గమ్మత్తుగా వుంది.
రాజ్ తరుణ్ హీరోగా, ఏఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ చేసిన సినిమా తిరగబడరాసామి. మాల్వి మల్హోత్రా ఇందులో హీరోయిన్. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నట్లు ఇటివలే అనౌన్స్ చేశారు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన నటించిన మరో సినిమా తెరపైకి వచ్చింది. అదే పురుషోత్తముడు. ఇది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లి ఎప్పుడు పూర్తి చేసుకుందో కానీ సడన్ గా ట్రైలర్ రిలీజ్ చేసి జూలై 26 రిలీజ్ డేట్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇలా మంచి స్టార్ట్ పాడింగ్ వున్న సినిమానే ఇది. మ్యూజిక్ కూడా గోపి సుందర్. అయితే ఈ సినిమాపై పెద్ద బజ్ లేదు.
తిరగబడరాసామి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో మన్నారా చోప్రాని దర్శకుడు స్టేజ్ పైనే కిస్ చేయడం లాంటి ఇన్సిడెంట్ తో ఏదోరకంగా సినిమా పేరు జనాల్లో నానింది. కానీ పురుషోత్తముడుకి ఏ హడావిడి లేదు. అయినా వారానికి ఓ సినిమా రావడం ఏమిటో రాజ్ తరుణ్ కే తెలియాలి. సినిమాల విషయంలో రాజ్ తరుణ్ ప్లానింగ్ తప్పిందనడానికి ఇదో సాక్ష్యంగా నిలుస్తోంది.