వివేకా హత్య కేసులో మొదట సీబీఐ విచారణకు డిమాండ్ చేసి.. ఆపై అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణకు అభ్యంతరం వ్యక్తం చేసి..నిందితులకు వంతపాడుతూ.. ఈ కేసును గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ అటకెక్కించింది. తమకు న్యాయం కావాలని అడిగిన వివేకా కూతురుతో బంధాన్ని కూడా తెంచుకున్నారు జగన్. కొంగు చాచి న్యాయం చేయండి అని కోరినా పట్టించుకోలేదు. వైసీపీ హయాంలో ఎలాగూ న్యాయం జరగలేదు..కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అయినా తమకు న్యాయం జరగకపోదా..? అని వైఎస్ వివేకా కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు.
ఈ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేరస్థుడే సీఎం అయితే పోలీసులు కూడా వంత పాడే పరిస్థితి వస్తుందని జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. దీంతో ఈ కేసులో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read : కేంద్ర బడ్జెట్ పై వైసీపీ సైలెన్స్ ..ఎందుకు?
ఈ కేసుపై మళ్లీ సిట్ వేయబోతున్నారా.? లేక సీబీఐ విచారణ ఓ కొలిక్కి రావడంతోనే చంద్రబాబు ఈ ప్రకటన చేశారా..? అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలతో వైసీపీలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో కీలక పరిణామాలు ఉంటాయనే ఆందోళనతో ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
జగన్ కేంద్ర పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న నేపథ్యంలో చంద్రబాబు అసెంబ్లీలో వివేకా హత్యకేసు ఇష్యూపై మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.