కాంగ్రెస్ బడ్జెట్ను చీల్చి చెండాడుతామని కేసీఆర్ ప్రకటించారు. ఎన్టీఆర్ కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. అప్పటి మాటల్ని చాలా అసువుగా నేటి రాజకీయాల్లో వాడేస్తూంటారు. అయితే ఈ చీల్చి చెండాడేది అసెంబ్లీలోనేనా అన్న డౌట్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకూ వస్తోంది. రెండో తేదీ వరకూ జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఇక కంటిన్యూ హాజరవుతారా లేకపోతే.. ఒక రోజు హాజరు వేయించుకున్నాను కాబట్టి ఇక రానవసరం లేదని అనుకుంటున్నారా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
కేసీఆర్ సభకు రావడం లేదని కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ సభ్యులను టీజ్ చేసేందుకూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికి సమాధానంగా బుధవారం కేటీఆర్ మీకు మేము చాలని కేసీఆర్ అవసరం లేదని అన్నారు. కానీ రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పదే పదే కేసీఆర్ ప్రస్తావన తీసుకు వస్తోంది. కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదన్నది మాత్రం బీఆర్ఎస్ చెప్పలేకపోతోంది. బడ్జెట్ ప్రసంగం వినేందుకు వచ్చినా సభలో ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఆయన చర్చలకు హాజరు అవుతారా లేదా అని చెప్పలేకపోతున్నారు.
Also Read: అయినా.. కేసీఆర్ దొరికిపోయారోచ్!
కేసీఆర్ సభకు వచ్చి రేవంత్ పై ఎదురుదాడి చేస్తేనే.. సమఉజ్జీల సమరం నడుస్తుందని లేకపోతే అడ్వాంటేజ్ రేవంత్ అన్నట్లుగా సభ సాగిపోతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కానీ అధికార బలంతో రేవంత్ ప్రభత్వం అవమానిస్తుందేమో అన్న భయంతోనే కేసీఆర్ ఆగిపోతున్నారని అంటున్నారు. కేసీఆర్ ధైర్యం చేసి వస్తే మాత్రం.. తెలంగాణ అసెంబ్లీ రంజుగా సాగిపోతుంది.