వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఐదు సంవత్సరాలకు పైగా విచారణ కొనసాగుతున్న ఈ కేసులో సీబీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ హత్యలో ఉన్న వివేకా డ్రైవర్ దస్తగిరి ఇప్పటికే అప్రూవర్ గా మారారు. దీంతో దస్తగిరికి బెయిల్ రాగా… ఇతర విచారణ కొనసాగుతోంది. తనను అప్రూవర్ గా సీబీఐ కూడా గుర్తించిన నేపథ్యంలో, తనను నిందితుల జాబితా నుండి తొలగించాలని దస్తగిరి కోర్టును ఆశ్రయించారు. దస్తగిరి పిటిషన్ పై సీబీఐ కూడా అభ్యంతరం చెప్పకపోవటంతో కోర్టు తనను నిందితుల జాబితా నుండి తొలగించేందుకు ఓకే చెప్పింది. ఇక నుండి దస్తగిరిని కేవలం సాక్షిగానే పరిగణించనున్నారు.
Also Read : పిన్నెల్లి బ్రదర్స్ కు మరో షాక్.. భూకబ్జాలపై విజిలెన్స్ విచారణ!
ఇదే కేసులో సీబీఐ ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అయితే, నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయిన వెంటనే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వగా… భాస్కర్ రెడ్డి కొంతకాలం జైల్లో కూడా ఉన్నారు. ఎన్నికల ముందు భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
వివేకా హత్య కేసును ఆయన కూతురు సునీత అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు నుండి తెలంగాణ హైకోర్టుకు మార్చగా, విచారణ కొనసాగుతోంది.