వైసీపీకి ముప్పుగా మారుతున్న కాంగ్రెస్ పై జగన్ పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. ఎదగనీయకుండా తాను కాంగ్రెస్ నీడలోనే ఉన్నానన్న సంకేతాలను ఢిల్లీ ధర్నా ద్వారా ప్రజలకు పంపారు. ఓ వైపు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జగన్ వైఎస్ జీవితాంతం వ్యతిరేకించిన బీజేపీకి అండగా ఉంటున్నారని ముస్లిం, దళితులను మోసం చేస్తున్నారని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంక్ కొంత షర్మిలకు వెళ్లింది. ముఖ్యంగా రాయలసీమలో అంత ఘోరంగా ఓడిపోవడానికి కాంగ్రెస్ కూడా ఓ కారణం. వచ్చే రోజుల్లో షర్మిల మరింత దూకుడుగా రాజకీయం చేసి ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.
Read Also :షర్మిల వాట్ నెక్ట్స్ ?
షర్మిల ఎంత బలపడితే వైసీపీ అంత బలహీనపడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ కాంగ్రెస్ పది శాతం ఓట్లు తెచ్చుకుంటే… జగన్ ఓటు బ్యాంక్ ముఫ్ఫై శాతానికి పడిపోతుంది. అప్పుడు ఇప్పుడు వచ్చినన్ని సీట్లు కూడా రావు. భవిష్యత్ కళ్ల ముందు కనిపించడంతో జగన్ కాంగ్రెస్ కు దగ్గరే అనే రాజకీయాన్ని ప్రారంభించారు. ముందుగానే ఇండియా కూటమితో మాట్లాడుకుని… ఢిల్లీ రాజకీయం ప్రారంభించారు. అవసరమే లేని ఢిల్లీ ధర్నాను ప్రకటించడం దానికి ఇండీ కూటమి నేతలంతా పోలోమంటూ రావడం వెనుక ఓ ప్రణాళిక ఉందని ఎవరికైనా అర్థమవుతుంది.
ఇప్పుడు షర్మిలకు ఇబ్బందే. ఆమె జగన్ పై విమర్శలు కొనసాగించవచ్చు. కానీ జగన్ దగ్గరవుతున్నారు కాబట్టి.. షర్మిలను ప్రోత్సహించాలా లేదా అన్నదానిపై కాంగ్రెస్ హైకమాండే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ రెడ్డి ఇప్పుడు తనకు ముప్పు వచ్చింది కాబట్టి. .. కాపాడుకోవడానికి కాంగ్రెస్ దగ్గరకు వస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శక్తి వంచన లేకుండా చేస్తున్నారు. ఓ రకంగా సోదరి షర్మిలపై జగన్ చేస్తున్న కుట్ర ఇది. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ?