సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారి సంగతి చూడటానికి ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలపై అనుచితమైన పోస్టులు పెట్టాలంటే ఎవరైనా సరే భయపడేలా చేస్తామని స్పష్టం చేశారు. ఈ మాటలు ఎప్పటికి ఆచరణలోకి వస్తాయో కానీ… సాక్షాత్తూ హోంమంత్రిపైనే అడ్డగోలు బూతులు మాట్లాడుతూ పెడుతున్న పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.
Also Read :ఆజ్ఞాతంలో వైసీపీ సోషల్ మీడియా ” ఉన్మాద వారియర్స్”
వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారందరిపై కేసులు పెట్టేవారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మాత్రం అన్ని రకాలుగా స్వేచ్చ ఉండేది. అప్పటి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలు వంగలపూడి అనితతో పాటు గౌతు శీరిష వంటి వారు అనేక సార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వారు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేధింపులు ఎదుర్కొన్న వంగలపూడి అని ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంగలపూడి అనిత గురించి వర్రా రవీంద్రా రెడ్డి అనే వ్యక్తి అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెట్టేవారు. చంద్రబాబు గురించి ఆయన కుటుంబం గురించి ఇష్టం వచ్చిటన్లుగా మాట్లాడిన వారంతా ఇప్పుడు హాయిగానే ఉన్నారు.
శ్రీరెడ్డి అనే వైసీపీ కార్యకర్త కేసు నమోదైన తరవాత కూడా యథేచ్చగా బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికీ పెద్ద ఎత్తన మహిళల్ని కించ పరిచే పోస్టులు పెడుతున్నారు. దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. అందకే టీడీపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక విభాగమని సీఎం అంటున్నారు.. ఎప్పటికి ఏర్పాటవుతుందో… ?