మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆయన అనుచరులు మా భూములు లాక్కున్నారు కొందరు, పెద్దిరెడ్డికి సంబంధించిన వారికి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కేటాయించారన్న ఆరోపణలకు తోడు ప్రభుత్వ భూమిలో తన ఇంటి కోసం రోడ్డు వేయించుకొని, గేట్ పెట్టారని ఇంకొందరు… ఇలా ప్రతి రోజు ఒక ఆరోపణ బయటకు వస్తూనే ఉంది. వీటన్నింటికి తోడు మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదం.
మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ప్రభుత్వ భూములను బదలాయిస్తూ జరిగిన పేపర్లు, ఫైల్స్ కు నిప్పంటించారు అని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనాకు వచ్చింది. సీఐడీ దీనిపై విచారణ చేస్తుండగా… సీఎం చంద్రబాబు అధికారికంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. 22ఏ ఫైల్స్ దగ్ధం అయ్యాయి.
ఇంత జరుగుతుంటే… ఎవరు దోషి, ఎవరు నిర్ధోషి అన్నది ప్రభుత్వం, కోర్టులు తేలుస్తాయి. కానీ, తన పార్టీ కీలక నేతలు కావటంతో పెద్దిరెడ్డిని, ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డిని జగన్ వెనకేసుకొచ్చారు. వారిద్దరూ చాలా మంచి వారిని, కావాలనే వారిని బద్నాం చేస్తున్నారన్నారు. వారు మంచి వారు కాబట్టే ప్రజలు గెలిపిస్తున్నారన్నారు.
Also Read : పెద్దిరెడ్డి అష్టదిగ్బందం… ఈసారి వదలేలా లేరుగా!
అంటే, ఓడిపోయిన వారంతా మంచి వారు కాదనే అర్థం అయితే… మొన్నటి ఎన్నకల్లో ఓడిన వారు తప్పు చేసినట్లే కదా? మరి వారందరినీ జగన్ దూరం పెట్టగలరా అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతాయి. పైగా పుంగనూరులో గెలిపించిన ప్రజలే ఇప్పుడు వారిని రాకుండా నిరసన తెలుపుతున్నారన్నది జగన్ కు తెలియదా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.
జగన్ సపోర్టు చేశారంటేనే మంచి వారో… చెడ్డ వారో ప్రజలందరికీ తెలుసు. మొన్నటి ఎన్నికల్లో అమాయకుడు, మంచి వాడు ఓటు వేయండని ప్రచారం చేస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన సంగతి మర్చిపోయినట్లున్నారు అంటూ టీడీపీ నేతలు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.