తాము ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లి మరీ గగ్గోలు పెట్టడం ఎంటో…? అంటూ మంత్రి నారా లోకేష్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. గత ఐదు సంవత్సరాల పాలనలో తప్పు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేసుకున్న మాట నిజమే అయినా, తాము ఇంకా ఆ బుక్ ను తెరవనే లేదు… చర్యలు తీసుకోవటం మొదలుపెట్టనే లేదు… అప్పుడే జగన్ గగ్గోలు పెడుతున్నారని లోకేష్ విమర్శించారు.
తాము ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తామని, రెడ్ బుక్ లో పేర్లున్న అధికారులపై కూడా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం తప్పా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
Also Read : జగన్ ఇంక మారడా..ఇలా అయితే కష్టమే!
సీఎంగా ఉన్నప్పుడు కేవలం రెండుసార్లు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టిన జగన్… ఇప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలో ఐదుసార్లు ప్రెస్ మీట్ పెట్టాడని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ చెప్పే అబద్ధాలను అసెంబ్లీకి వచ్చి చెబితే… అందులో నిజం ఎంత, అబద్ధం ఎంతో తాము అధికారికంగా చూపిస్తామన్నారు.
గతంలో వైసీపీ నేతల్లా తమ కూటమి నేతలు ప్రవర్తించరని, వ్యక్తిగతంగా దాడులకు దిగబోరని నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతీకార చర్యలుండవని… శాంతిభద్రతలను కాపాడుకుంటామని చెప్పారు. అయితే, పార్టీ కోసం కష్టపడ్డ నేతలు, పార్టీ కోసం పనిచేస్తుంటే వైసీపీ దాడులకు గురైన నేతలెవరో తమకు తెలుసని… రాబోయే రోజుల్లో వారందరికీ పదవులిచ్చి గౌరవించుకుంటామని లోకేష్ ప్రకటించారు.