బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరిగినా..ఆ వార్తలను ఖండించారు ఎర్రబెల్లి. తాను కేసీఆర్ తోనే ఉంటానని స్పష్టం చేసి..పార్టీ మార్పు వార్తలకు చెక్ పెట్టారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో సీనియర్ నేత ఎర్రబెల్లి మౌనం సందేహంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. కీలక నేతలు కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి మౌనం చర్చనీయాంశం అవుతోంది.
Also Read : రేవంత్ ఇన్విజిలేషన్.. కేసీఆర్ పాస్ అవుతాడా?
బీఆర్ఎస్ చేపట్టిన కాళేశ్వరం సందర్శనకు వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి డుమ్మా కొట్టారు. ఆయన హైదారాబాద్ లోనే ఉన్నా , ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేదు. జిల్లాలో కూడా పార్టీ కార్యకర్తలకు కూడా పెద్దగా అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు.
ఎర్రబెల్లి పార్టీ మారుతారని బీఆర్ఎస్ కూడా ఓ అంచనాకు వచ్చిందని అందుకే..ఆయనను లైట్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదీ ఏమైనా.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి అధికారం కోల్పోయాక కొనసాగిస్తోన్న సైలెన్స్ మర్మం ఏంటో అర్థం కాక రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.