తిరుమల వెంకన్న దర్శనం అంటే దేశ, విదేశాల నుండి వస్తుంటారు. ఉత్తరాధి నుండి తిరుమలకు ఒక్కసారి వెళ్లి రావాలన్న వారు అధికంగా ఉంటారు. వెంకటేశ్వేర స్వామి వారి దర్శనం కోసం ఎంత కష్టమైన ఓర్చుకుంటారు భక్తులు. కానీ, ఆ తిరుమల వెంకన్న దర్శన భాగ్యాన్ని క్లిష్టతరం చేసి, బోర్డులో రాజకీయాలు జొప్పించి… గతంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒకరిద్దరు కనుసన్నల్లోనే అంతా జరిగేది.
కానీ, కూటమి సర్కార్ రాగానే… సీఎం చంద్రబాబు తిరుమలపై ఫస్ట్ ఫోకస్ చేశారు. ఏళ్లకు ఏళ్లుగా అక్కడే ఉండి, అంతా తానే అయిన జేఈవో ధర్మారెడ్డిని పంపించారు. ఇతర అధికారులను బదిలీ చేసి… శ్యామలరావు అనే సీనియర్ ఐఏఎస్ ను ఈవోగా నియమించారు.
గతంలో తిరుమల లడ్డు ఎంత బాగుండేది? క్యూ లైన్లో అన్న ప్రసాదం ఎందుకు ఆపేశారో…?, వృద్ధులకు పాలిచ్చే తల్లులకు వెయిటింగ్ కంపార్టుమెంట్ లో టీటీడీ పాలు ఇచ్చేది అది కూడా నిలిపేశారు.. ఇలాంటివి కోకొల్లలు. దీంతో కొత్త ఈవో వచ్చి రాగానే శుభ్రతకు ముందు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలు, రివ్యూలు, హెచ్చరికలు…. ఫలితంగా టీటీడీలో మార్పు మొదలైంది. గతంలో ఉన్న సౌకర్యాలు తిరిగి మొదలయ్యాయి.
లడ్డూ దగ్గర నుండి తిరుమల కొండపై అధిక రేటుకు అమ్మే వాటర్ బాటిల్స్ వరకు అన్నింటిపై కొత్త ఈవో ఫోకస్ చేశారు. వ్యాపారులను పిలిచి నిబంధనలు ఏంటో… అవి పాటించకుంటే పర్యవసనాలేంటో చెప్పారు. అవినీతి అధికారులపై వేటు పడటం మొదలైంది. నాణ్యతపై ఫోకస్ పెరిగింది. అంతేందుకు తిరుమల శ్రీవారి ప్రసాదాలకు సప్లై చేసే వస్తువుల నాణ్యత కూడా పెరిగింది.
ఈవో భక్తులతో నేరుగా మాట్లాడుతున్నారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎవరు ఎలా అవినీతి చేస్తున్నారు… దేవదేవుడి దర్శనంపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఫలితంగా ఒక్కొక్కొటిగా మార్పులు కనిపిస్తున్నాయి. త్వరలో రాబోయే పాలకమండలి కూడా నిబద్ధతతో పనిచేసే వారే ఉంటుందన్న ప్రచారం కూటమి నేతల్లో ఉంది.