జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సూటిగా ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్… ఎందుకు మీకు సంఘీబావం ప్ర‌క‌టించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో క‌ప‌ట నాట‌కం ఆడినందుకా…? వ్య‌క్తిగ‌త హ‌త్య‌కు రాజ‌కీయ రంగు పులిమినందుకా? ప్ర‌త్యేక హోదాను గాలికి వ‌దిలేసి, విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోనందుకా? అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల కోసం చేసిన ఉద్య‌మాల్లో దేనికీ జ‌గ‌న్ పార్టీ సంఘీభావం ప్ర‌క‌టించ‌లేదు. మ‌ద్ద‌తు తెల‌ప‌లేదు. మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ దేశ‌వ్యాప్త ఉద్య‌మం చేప‌డితే మీరు ఆనాడు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారా అని ష‌ర్మిల ప్ర‌క‌టించారు.

Also Read : జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

మీ నిర‌స‌న‌లో నిజం లేద‌ని తేలిపోయింది… అందుకే కాంగ్రెస్ పార్టీ మీ నిర‌స‌న‌కు దూరంగా ఉంద‌ని ష‌ర్మిల స్ప‌ష్టం చేశారు.

వినుకొండ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ష‌ర్మిల స్పందిస్తూ, అందులో వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు తప్పా రాజ‌కీయ క‌క్ష‌లు లేవ‌ని… ఇది త‌మ పార్టీతో పాటు మీడియా వ్య‌క్తుల‌తో స‌మాచారం ధృవీక‌రించుకున్నామ‌ని ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రోసారి అదే విష‌యాన్ని వెల్ల‌డిస్తూ జ‌గ‌న్ అంటూ తమ వైఖ‌రి చెప్ప‌క‌నే చెప్పారు. ఇండియా కూట‌మికి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌వుతున్నారని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో ష‌ర్మిల స్పంద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close