మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందంపై అనేక సందేహాలున్నాయని నేను నిన్న 360లో రాశాను. ే ఈ ఒప్పందంపై విమర్శలను పనికిమాలినవని తెలంగాణ నీట ిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కొట్టి పారేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా సమైక్య రాష్ట్రంలో నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని మరోసారి చెప్పారు. సరే అది ముగిసిన అధ్యాయం. ఇప్పుడు కుదిరింది నిజానికి నిర్దిష్ట ఒప్పందమే కాదు, అన్నిటి గురించి చర్చించేందుకు ఇరు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ మాత్రమే. మళ్లీ ఒకో బ్యారేజీపై ఆమూలాగ్రం చర్చ జరగవలసిందే. ఎప్పటి సమస్యలు అప్పుడు పరిష్కరించుకోవలసిందే. నేను రాసిన దాని సారాంశం అదే. అయితే మహారాష్ట్ర ఇంతకన్నా మరో అడుగు ముందుకేసి అసలు ఒప్పందమే జరగలేదు పొమ్మని ప్రకటించింది. ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి గిరీశ్ మహాజన్ దైనిక్ భాస్కర్ పత్రికతో మాట్లాడుతూ ప్రధాని పరిధిలోని సించారు పరియోజన పథకం కింద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్ దేవేంద్ర ఫడ్నవీస్‌లు చర్చించారని వివరించారు. అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించామనీ మళ్లీ దీనిపై భేటీ కావలసి వుందని చెప్పారు. జలవనరుల కోసం తెలంగాణ ముందు ఆంధ్ర ప్రదేశ్‌తో అవగాహనకు రావడం అవసరమని కూడా గిరీశ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌గా వున్న బిజెపి నేత సిహెచ్విద్యాసాగర రావు పాత్రకు సంబంధించిన ప్రచారంపైన మహారాష్ట్ర ఒకింత కినుక వహిస్తున్నది. మేడిగడ్డ రిజర్వాయర్ శంకుస్తాపనకు ఆయనను ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంపై ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నది. విద్యాసాగర్‌కు తద్వారా తమకు మరింత ఘనత ఇవ్వాలని బిజెపి నేతలు చర్చల్లో చెబితే ఇది రాష్ట్రాల మధ్య వివాదాన్నిరాజ్యాంగసమస్యలను పెంచుతుందని నేనొక చర్చలో చెప్పాను. ఇదంతా చూస్తే ఆ వైపే నడుస్తున్నట్టు కనిపిస్తుంది.