కోర్టులో నీవేమైనా చెప్పుకోవాలంటే బోనులో నిలబడి చెప్పుకోవాలంటారు న్యాయమూర్తులు.అలా చెబితే దానికి వాల్యూ వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టులు అసెంబ్లీలే. అక్కడ చెప్పే వాటికే విలువ ఉంటుంది. కానీ వైసీపీ మాత్రం మేము ప్రజాకోర్టులో చెప్పేదేమీ ఉండదు.. అని ప్రెస్మీట్లలో తెగ మాట్లాడేస్తున్నారు. ఆర్థిక శాఖ శ్వేతపత్రాన్ని బయట పెట్టక ముందే జగన్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. తర్వాత రోజు బుగ్గన హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి అదే చేశారు.
హామీలు..హామీలు అని వీరు తెగ ఇదైపోతున్నారు కానీ.. జగన్ రెడ్డి 2019 జూన్ లో అధికారం చేపడితే.. జనవరిలో అమ్మఒడి అమలు చేశారు. సీఎంగా అధికారం చేపట్టిన వెంటనే 250రూపాయల పించన్ పెంచారు. కానీ చంద్రబాబు మొదటి నెల ఒక్కొక్క అవ్వాతాతకు ఏడువేలు ఇచ్చారు. తల్లికి వందనం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా వైసీపీ నేతలు పథకాల అమలు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
Also read : కేంద్ర బడ్జెట్ పై వైసీపీ సైలెన్స్ ..ఎందుకు?
అయినా తాము చెప్పాలనుకున్నది అసెంబ్లీలో చెప్పాలి కానీ.. ఎక్కడో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడితే ఏం లాభం అన్నది వారికే తెలియాలి. అసెంబ్లీలో చెప్పే దానికే విలువ ఉంటుంది. ఒక వేళ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే.. ప్రజలే చూస్తారు కదా.. చెప్పడానికి అనుమతి ఇవ్వలేదని బయట చెప్పారని అనుకుంటారు. అసలు అసెంబ్లీకి రాకుండా తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు బయట పెట్టి.. అవే వాస్తవాలు అని చెప్పుకోలేకుండా… ప్రెస్మీట్లలో ఎన్ని ఆర్తనాదాలు పెడితే ప్రయోజనం ఏమిటి ?