నాని, వివేక్ ఆత్రేయ ‘సరిపోదా శనివారం’కోసం మళ్ళీ కలిశారు. గతంలో ‘అంటే సుందరానికీ’ లో నానిని స్మార్ట్ అండ్ క్యూట్ గా చూపించిన వివేక్ ఈసారి తనలోని రగ్గడ్ అవతార్ ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ఆసక్తిని పెంచింది. ఇప్పటివరకూ ఈ సినిమా కథ గురించి పెద్దగా హింట్ ఇవ్వలేదు. కేవలం శనివారం మాత్రమే హీరోకి పవర్స్ వస్తే ఎలా వుంటుందనే పాయింట్ చుట్టూ కథ వుంటుందనే టాక్ వుంది.
Also Read : ఇది నాని నరకాసుర వధ!
ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సోకులపాలెం అనే ఏరియా చుట్టూ నడిచేకథ ఇది. ఆ ఏరియాని పరిచయం చేస్తూ తాజాగా పోస్టర్ కూడా వదిలారు. ఇందులో రెండు వర్గాలు వున్నాయి. అజయ్, మురళీ శర్మ ఒక వర్గం, నారాయణ ప్రభ పేరుతో కాళి, మార్టిన్, అజయ్ ఘోస్ పాత్రలు మరో వర్గంగా వుంటాయి. వీరి మధ్య క్రూరమైన పోలీస్ గా ఎస్జే సూర్య. వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే గమ్మత్తుగా వుంటుంది. ఈ పాత్రలన్నీ హీరో కథకు ముడిపెట్టిన విధానం ఆసక్తికరంగా వుంటుందని తెలుస్తుంది. ఆగస్ట్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.