యానిమల్ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించవచ్చు. రణబీర్ కపూర్ కెరీర్ లో హయ్యస్ట్ వసూళ్లు తెచ్చి పెట్టిన సినిమా కావచ్చు. కానీ ఆ సినిమాపై అదే స్థాయిలో విమర్శలు వున్నాయి. ఈ సినిమా బాలీవుడ్ పెద్దలకు నచ్చలేదు. అందులో వుండే కంటెంట్ ని కపూర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సన్నిహితంగా వుండేవాళ్ళు తీవ్రంగా ఆక్షేపించారు. బయటికి చెప్పకపోయిన కపూర్ వారస్వతం కొనసాగిస్తున్న హీరో ఇలాంటి సినిమా చేయడం సరికాదని, ఇది భావితరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిచూస్తుందని, అంత స్త్రీద్వేషాన్ని రెచ్చగొట్టే కథలు మంచిది కాదని, ఇకపై అలాంటి సినిమాలు వద్దుని రణబీర్ ని పర్శనల్ గా కలసి చెప్పారు.
Also Read : యానిమల్ కి సీక్వెల్ కూడా…
యానిమల్ పై వచ్చిన వివాదాలపై తాజాగా రణబీర్ కపూర్ స్వయంగా స్పందించాడు. ఓ సోషల్ మీడియా ఈవెంట్ లో మాట్లాడిన ఆయన ‘యానిమల్ సినిమా పరిశ్రమలో చాలా మంది నా శ్రేయోభిలాషులకి నచ్చలేదు. ఇలాంటి కంటెంట్ నేను చేయడం వారు జీర్ణించుకోలేకపోయారు. వారికి క్షమాపణలు చెప్పాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు నాలో కూడా చాలా భయాలు వచ్చాయి. వసూళ్లు మాట పక్కన పెడితే ఆ సినిమా కంటెంట్ అంత నెగిటివ్ గా వెళుతుందని నేను ఊహించలేకపోయానని చెప్పుకొచ్చారు రణబీర్. మొత్తానికి యానిమల్ పై చేలరేగిన వివాదాలన్నిటికీ రణబీర్ తన క్షమాపణతో పుల్ స్టాప్ పెట్టినట్లేనని అనుకోవాలి.