తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి – బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మొదట మంత్రులు – కేటీఆర్ మధ్య ఈ డైలాగ్ వార్ కొనసాగగా.. ఆ తర్వాత రేవంత్ రియాక్షన్ తో ఈ ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. కేటీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలంటూ రేవంత్ ఆగ్రహంతో హెచ్చరించారు.
ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామని హామీ ఇచ్చారు.. మూసి సుందరీకరణ అంటున్నారు..లండన్ చేయండి.. స్వాగతిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 16వేల కోట్లతో తాము ప్రతిపాదనలు సిద్దం చేస్తే.. దానిని లక్షన్నర కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకు ప్రతిపాదనలు పెంచారో సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై రేవంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
Also Read : బీఆర్ఎస్ నేతల అల్ప సంతోషం..!
కేటీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు.. పదినెలలు కూడా నిండని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. బతుకమ్మ చీరలను సిరిసిల్లలోని నేతన్నలే నేశారా..? సూరత్ నుంచి తెప్పించారా..? కమిషన్లు కొట్టి పేదలను మోసం చేశారా.? ఎంఎంటీఎస్ ను విమానాశ్రయం వరకు ఎందుకు విస్తరించలేదు..? దీని వెనక అసలు విషయం ఏంటి..? హుస్సేన్ సాగర్ వాటర్ ను కొబ్బరి నీళ్ళలా మారుస్తామని కేసీఆర్ ల తానెప్పుడు అబద్దం చెప్పలేదని కేటీఆర్ కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.