ఓ సినిమా హిట్ అయితే చాలు ఇక మితగా భాషల వారు ఆ సినిమాను దక్కించుకునేందుకు నిర్మాతకు ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటపడతారు. తెలుగు ప్రేక్షకులు కేవలం మంచి సినిమాలనే ఆదరిస్తారని.. ఇక్కడ హిట్ అంటే ఇక ఎక్కడైనా హిట్ కొట్టేయొచ్చు అనే ధైర్యంతో తెలుగులో హిట్ అయినా మినిమం బడ్జెట్ సినిమాకు కూడా భారీ ఆఫర్స్ వస్తాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన కళ్యాణ వైభోగమే ఇందుకు ఉదాహరణ.
నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ వైభోగమే మార్చ్ 4న రిలీజ్ అయ్యింది. నాగ శౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమా మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 2.5 నుండి 3 కోట్ల దాకా వసూళు చేసిన ఈ సినిమా తమిళ రైట్స్ కోసం ఓ నిర్మాత భారీ మొత్తం ఆఫర్ చేశాడట. అంతేకాదు బాలీవుడ్ నుండి ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం పొటీ పడుతున్నారట.
మొత్తానికి తాను కేవలం కాపీ సినిమాలే తీస్తుంది అంటూ జబర్దస్త్ సినిమా టైంలో ఆమెను కించపరచిన వారే నందిని రెడ్డి సూపర్ దర్శకురాలు అని ఆమె టాలెంట్ ను మెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే రెండు సినిమాలను నిర్మించిన దామోదర ప్రసాద్ ఇదే టీం తో మరో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.