ఏప్రిల్ 8న సర్దార్ రావడం ఖాయమే అని చిత్రబృందం చెబుతున్నా… అభిమానుల్లో మాత్రం టెన్షన్ తగ్గడం లేదు. ఈ సినిమా అనుకొన్న సమయానికి వస్తుందా, రాదా?? అన్న అనుమానాలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. మరో పది రోజుల పాటు సర్దార్ టాకీ చిత్రీకరించాల్సివుందట. దానికి తోడు పాటలూ బాకీ పడిపోయారు. అంటే.. రాత్రీ పగలూ పనిచేస్తేగానీ ఏప్రిల్ 8న సర్దార్ రాదు. అందుకే.. ఇప్పుడు చిత్రబృందం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని టాక్.
ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో సర్దార్ షూటింగ్ జరుగుతోంది. ఓపక్క కీలకమైన యాక్షన్ సన్నివేశం, మరోవైపు ప్యాచ్ వర్క్లు పూర్తవుతున్నాయి. నాలుగు డైరెక్షన్ డిపార్ట్మెంట్ యూనిట్లు… సర్దార్ పనిలో బిజీగా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు ఎడిటింగ్ పనులూ చకా చకా జరుగుతున్నాయి. ఈలోగా ఆడియో ఫంక్షన్ కూడా దగ్గరపడిపోయింది. ఈనెల 20న హైదరాబాద్లో సర్దార్ పాటలు విడుదల కాబోతున్నాయి. వేదిక కూడా ఇంకా కన్ఫామ్ కాలేదు. దాంతో.. టెన్షన్ మరింత పెరిగిపోయింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఏప్రిల్ 8నే సర్దార్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాల్సిందే అని అల్టిమేట్టం జారీ చేశాడట. ఆయన చెప్పాడంటే ఇక తిరుగులేనట్టే లెక్క. ఎన్ని టెన్షన్లు పడినా, ఎన్ని అనుమానాలు తలెత్తినా… అనుకొన్న సమయానికి సర్దార్ రావడం ఖాయం.