నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రెండో బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ పై విస్తృతమైన చర్చ జరిగింది. ఆ సమయంలో తాను ప్రజారాజ్యం పార్టీకి చాలా పని చేశానని చెప్పుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక జనసేన పార్టీకి పని చేశారు. అయితే నేరుగా ఏ పదవిలోనూ లేరు. కానీ తర్వాత వివాదాల్లో ఇరుక్కుని దూరమయ్యారు.
తన కుటుంబ పని మనిషికి శిరోముండనం చేయించి జైలుకెళ్లారు. లగడపాటి సర్వేలు ఎత్తిపోవడానికి కారణం అయ్యారు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. హఠాత్తుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయినయ్యారు. ఆయన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. ఆయన మొదటి ప్రయారిటీ జనసేనే అయి ఉంటుంది.. ఎందుకు కాంగ్రెస్ వైపు చూశారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : షర్మిల నిలదీస్తున్నా జగన్ మౌనం ఎందుకు..?
జనసేన పార్టీలోకి ఆయనను చేర్చుకునేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించకపోవడంతోనే నూతన్ నాయుడు పట్టుదలగా కాంగ్రెస్ లో చేరారని అంటున్నారు. ఆయన ఓ పొలిటికల్ కన్సల్టెన్సీని కూడా నడుపుతున్నారని.. దాని ద్వారా సర్వేలు.. ఇతర రిపోర్టులు ఇచ్చే అవకాశం ఉండటంతో.. కాంగ్రెస్ కు హెల్ప్ అవుతుందని షర్మిల భావించారని అంటున్నారు. కాంగ్రెస్ లో ఎవరు చేరినా వారికి ఏదో ఓ పదవి ఇవ్వడానికి స్కోప్ ఉంది. నూతన్ నాయుడు చేరి ఊరుకుంటారా.. లేకపోతే కాంగ్రెస్ తరపున మీడియా ముందుకు వస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.