మాజీ మంత్రి రోజా మరోసారి టీవీ ఫీల్డ్ లో అవకాశాల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తమిళ టీవీ చానళ్లలో అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఓడిపోయిన తర్వాత ఆమె ఎక్కువగా చెన్నైలో ఉంటున్నారు. ఒకటి , రెండు సార్లు బయటకు వచ్చి మాట్లాడినప్పటికీ ఆమె తిరుమలలో చేసిన టిక్కెట్ల దందా, మంత్రిగా చేసిన అవకతవకల వ్యవహారాలపై విస్తృతంగా ప్రచారం జరగడం, ఫిర్యాదులు కూడా సంబంధిత అధికారులకు అందడంతో సైలెంట్ అయిపోయారు.
చెన్నైలోనే ఉంటున్న రోజా.. వచ్చే ఐదేళ్ల కాలం ఖాళీగా ఉండలేమని.. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. తనకు మంచి ఫేమ్ తెచ్చి పెట్టిన జబర్దస్త్ లో జడ్జి అవకాశం కోసం మళ్లీ మల్లెమాల ఎంటర్టెయిన్మెంట్ ను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తమిళ టీవీ చానళ్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో కొన్ని షోలకు రోజా పని చేశారు. అయితే మల్లెమాల నుంచి సానుకూల స్పందన రావడం లేదు. ఆమెపై పొలిటికల్ గా నెగెటివ్ ఇమేజ్ ఎక్కువగా ఉండటంతో సమస్య అవుతుందని ఆలోచిస్తున్నారని అంటున్నారు.
Also Read : జగన్ స్కాములు రోజాకు చెమటలు !
తమిళనాడులో టీవీ చానళ్ల నుంచి ఆమెకు ఒకటి, రెండు అవకాశాలు వచ్చే చాన్స్ లు ఉన్నాయని చెబుతున్నారు. రోజా భర్త సెల్వమణి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రోజా ఇప్పుడల్లా రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని .. మరో రెండేళ్ల వరకూ.. చుట్టపు చూపుగానే నియోజకవర్గానికి వెళ్తారని..ఏపీకి వస్తారని అంటున్నారు.