బంగ్లాదేశ్ పరిణామాలు ప్రపంచాన్ని ఒక్క సారిగా నివ్వెరపరిచాయి. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ ఉంది. కానీ అక్కడి ప్రజల ఆగ్రహంలో పడి కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షురాలు పరారయ్యారు.
సుదీర్ఘ ప్రధాని – విపక్షాల అణిచివేత
2009 నుంచి బంగ్లాదేశ్‌ను షేక్ హసీనా పరిపాలిస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడిపిన మహిళగా ఈమె పేరుపొందారు. కానీ ఎన్నికలు జరిగిన వైనంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. 2015లో ఇద్దరు ప్రతిపక్ష నేతలకు ఉరి శిక్ష కూడా అమలు చేశారు. తర్వాత కూడా అదే కుట్రలు చేశారు. ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది . అది బయటపడటానికి ఓ కారణం అవసరం అయింది.
Read Also :పారిపోయిన ప్రధాని – బంగ్లాదేశ్‌లో సైనిక పాలన
షేక్ హసీనా అధికార అహంకారం
బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా, బంగ్లాదేశ్ లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రస్తుత పరిస్థితికి దారి తీసింది. ఆ కోటా వద్దని యువత డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లకు పైగా ఉన్నారు. అందులో దాదాపు 3 కోట్లకు పైగా యువకులు నిరుద్యోగులు . విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేందుకు హసీనా నిరాకరించడంతో పరిస్థితి బాగా తీవ్రం అయింది. ఈ కోటా వర్తింపజేయడాన్ని వ్యతిరేకిస్తున్నవారు ‘రజాకార్లు’ అని షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలతో యువత రగిలిపోయింది.
జూలైలోనే ప్రారంభం
జూలైలోనే యువత రోడ్లు, రైల్వే లైన్లను మూసేయడం, కార్యకలాపాలను దిగ్భంధించడం మొదలుపెట్టారు. జూలై 18 నాటికి హసీనా చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు కదం తొక్కారు. ఘర్షణల్లో 14 మంది పోలీసు అధికారులు, మరో 68 మంది మరణించారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నిరసనకారుల వైపు నిలబడ్డారు. దీంతో హసీనాకు పారిపోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.