వర్షాలు పడ్డాయి.. వరదలొచ్చాయి.. మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా నీళ్ల పారాయి.. ప్రపంచ అద్భుతాన్నికూలిపోయిందని.. కూలిపోతుందని ప్రచారం చేస్తారా అని బీఆర్ఎస్ చేసిన హడావుడి ఇంకా కళ్ల మందే ఉంది. కానీ మేడిగడ్డ బ్యారేజ్ లో మరిన్ని పియర్స్ కు పగుళ్లు వచ్చాయని తాజాగా తేలింది. బ్యారేజ్లో గేట్లు అన్ని ఎత్తి పెట్టారు. నీరు నిల్వ చేయడానికి గేట్లు మూసి ఉంటే.. పెను ప్రమాదం సంభవించి ఉండేది. కానీ నీళ్లు ఎత్తిపోయలేదని ఆరోపిస్తూ కేటీఆర్ రెండు రోజుల పాటు టూర్ వేశారు. తామే మోటార్లు ఆన్ చేస్తామని కూడా ప్రకటించారు.
కానీ ఇప్పుడు మేడిగడ్డకు జరిగిన డ్యామేజ్ అలాంటి ఇలాంటి ది కాదని.. తాజాగా వెల్లడవుతున్న నివేదికలు వెల్లడిస్తున్నాయి. నీరు బ్యారేజీ మీదుగా ఇంకా వెళ్తోంది. వరద తగ్గిన తర్వాత పరిస్థితిని నిపుణులు మరోసారి పరిశీలన జరిపితే.. అసలు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థమయ్యే అవకాశం ఉంది. వర్షాలు..గోదావరికి వరద సీజన్ ముగిసిన తర్వాతనే మరమ్మత్తులో.. పగుళ్లిచ్చిన పియర్స్ ను తీసేసి మళ్లీ కొత్త వాటిని నిర్మంచడమో చేయాల్సి ఉంది.
కాళేశ్వరం విషయంలో తమ తప్పును చాలా చిన్నదిగా చూపించడానికి కేటీఆర్ బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ప్రతీ దాన్ని కాళేశ్వరంతో పోల్చేసుకుంటున్నారు. వచ్చే ప్రతీ నీటిని కాళేశ్వరం నీళ్లంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు డొల్లతనంపై రోజు రోజుకు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు అసలు డ్యామేజీ జరగకపోయినా అతి పెద్ద నిరర్థక ప్రాజెక్టు అని.. అది సృష్టించే సంపద కరెంట్ బిల్లులకూ సరిపోదని ఇప్పటికే కాగ్ లాంటి రిపోర్టులు వెల్లడించాయని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.