‘ఇస్మార్ట్ శంకర్‌కు’ సీక్వెల్ గా తయారైన ‘డబుల్ ఇస్మార్ట్’ ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్లోనే పూరిలోని మాస్ మొత్తం బయటపడిపోయింది. రామ్ డైలాగులు, వేసిన మాస్ స్టెప్పులు ఇవన్నీ థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించే అంశాలే. రామ్ కు కూడా రొటీన్ కి భిన్నంగా నటించే స్కోప్ ఈ సినిమాతో దక్కిందట. కొన్ని సన్నివేశాల్లో రామ్ సంజయ్‌దత్ ని ఇమిటేట్ చేస్తాడని తెలుస్తోంది. సంజూకంటూ సెపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉంది. తన డైలాగ్ డెలివరీ భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ రామ్ ఇమిటేట్ చేయబోతున్నాడట. సంజూ – రామ్ ల మధ్య స్నేహం, అందులోంచి పుట్టుకొచ్చిన వైరం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని తెలుస్తోంది.
‘డబుల్ ఇస్టార్ట్లో’ పూరి కొన్ని యదార్థ సంఘటనల్ని చొప్పించడానికి తెలుస్తోంది. ఒకరి ఆలోచనలు, ఐడియాలజీ మరొకరికి ట్రాన్ఫర్ చేయడం ‘డబుల్ ఇస్మార్ట్’ కథ. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార వేత్త సేమ్ టూ సేమ్… ఇలాంటి ప్రయోగానికే పూనుకొన్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అఫ్కోర్స్ ఆ ప్రయోగం సక్సెస్ కాలేదనుకోండి. ఒకవేళ సక్సెస్ అయితే ఏమిటన్న పాయింట్ తోనే పూరి ఈ కథ రాసుకొన్నాడని తెలుస్తోంది. నిజానికి ‘ఇస్టార్ట్ శంకర్’లో కథేం ఉండదు. జస్ట్ ఆ ఐడియా, రామ్ క్యారెక్టరైజేషన్ మాస్ ని బాగా పట్టేశాయి. అయితే ‘డబుల్ ఇస్మార్ట్‌లో’ మాత్రం పూరి బలమైన కథని, ఎమోషన్‌నీ రాసుకొన్నాడని తెలుస్తోంది. దానిపైనే పూరి నమ్మకం పెట్టుకొన్నాడు.