ఒలంపిక్స్ పతకం ఖాయం అనుకుంటున్న దశలో… పోరాడి, గెలిచి, నిలిచిన ధీర వనితగా దేశం అంతా కొనియాడుతున్న వినేషన్ ఫోగట్ పై ఒలంపిక్స్ లో అనర్హత వేటు పడింది. ఫైనల్స్ కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉందంటూ ఒలంపిక్స్ సంఘం అనర్హత వేటు వేసింది. 50కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా… 100గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ అనర్హత వేటు వేశారు.
గత ఏడాది బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వినేషో ఫోగట్ పోరాడారు. పోలీసు దెబ్బలతో పాటు అవమానాలు ఓర్చుకొని, దాదాపు ఏడాదిన్నర ఆటకు దూరమైనా… ఎంతో కష్టపడి ఒలంపిక్స్ కు సిద్ధం అయ్యింది వినేష్ ఫోగట్.
అంతే పట్టుదలగా ఆడి… తన కష్టానికి ఫలితం దక్కుతుందనుకుంటున్న చివరి నిమిషంలో 100గ్రాముల ఓవర్ వెయిట్ కారణంగా ఒలంపిక్స్ ను నుండి బయటకు రావాల్సి వచ్చింది.
ఈరోజు రాత్రి వినేష్ ఫోగట్ బంగారు పతకం కోసం ఆడాల్సి ఉండగా… ఆటకు దూరం కావటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.