తనకు జెడ్ ప్లస్ కేటగరి భద్రత ఇవ్వాలని… సీఎం స్థాయి సెక్యూరిటీ కేటాయించాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టుకు వెళ్లారు. తనకు ప్రాణహని ఉందని ఆయన లాయర్లు వాదిస్తూ, పదే పదే ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ సీఎం అయినా, సీఎం స్థాయి సెక్యూరిటీ కల్పించాలని కోరారు.
దీనిపై ప్రభుత్వం వివరణ కోరింది హైకోర్టు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ సూచనలకు అనుగుణంగా జగన్ కు భద్రత ఇస్తున్నామని ప్రభుత్వం తెలపగా, మాజీ సీఎంలకు ఏ స్థాయి భద్రత ఇస్తారో ఏమైనా ప్రత్యేక నిబంధన ఉందా అని కోర్టు ప్రశ్నించగా లేదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇస్తే తప్పేంటి అని కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. ప్రభుత్వం కూడా అంగీకరించింది. జగన్ సెక్యూరిటీ సిబ్బంది కోరితే జామర్ ఇస్తామని తెలిపింది. అయితే, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని జగన్ లాయర్లు కోరగా… అందుకు కూడా ప్రభుత్వం అంగీకరించటంతో, ఈ కేసును హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.
అంటే, జగన్ కొత్త వాదనతో మారింది తన సెక్యూరిటీ కాదు. కేవలం బుల్లెట్ ప్రూఫ్ వాహనం మాత్రమే…