అత్యాధునిక సాంకేతికతో ప్రజలకు అమూల్యమైన సేవలు అందించే విషయంలో చంద్రబాబు కొత్త కొత్త టెక్నాలజీని వినియోగించడానికి ఏ మాత్రం వెనుకాడరు. దేశంలో మొదటి సారి మైక్రోసాఫ్ట్ అజూరే సాంకేతికతను 2014లోనే ఉపయోగించుకుంది చంద్రబాబు ప్రభుత్వమే. ఆయన ఆర్టీజీఎస్ లాంటి అత్యాధునిక పాలనా వ్యవస్థల్ని మానిటరింగ్ చేసే సాంకేతిక పద్దతుల్ని ఉయోగిస్తూంటారు. తాజాగా చంద్రబాబు పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు.
వ్యవసాయం, ఆరోగ్య, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో ఏఐ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. వీటి ద్వారా అత్యాధునిక సేవలను శరవేగంగా అందించడానికి అవకాశం ఏర్పడుతోంది. అందుకే చంద్రబాబు గూగుల్‌తో సంప్రదించారు. ఇటీవల యూట్యూబ్ అకాడెమీ కోసం చంద్రబాబు … ఇద్దరు గూగుల్ టాప్ ఎగ్జిక్యూటివ్స్‌తో ఆన్ లైన్లో సమావేశం అయ్యారు. అదే సమయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వారితో చర్చలు జరిపారు. గూగుల్ ఏఐ టెక్నాలజీని ఏపీ ప్రభుత్వం విస్తృతంగా ఉపయోగించుకోవడానికి సహకరించాలని చంద్రబాబు కోరారు. దానికి వారు అంగీకరించారు. ఈ మేరకు గూగుల్‌తో ఒప్పందం చేసుకోనున్నారు.
రాబోయే రోజుల్లో సాంకేతిక అనూహ్యమైన మార్పులకు గురి కానుంది. మారుతున్న ప్రపంచంతో పాటు స్కిల్స్ ను అందుకోవడానికి ఏఐ పై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఒక అడుగు ముందు ఉన్న వారికే భవిష్యత్ లో ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఏపీ యువతకు ఎక్కువ అవకాశాలు.. ఏపీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు.