” ఇది వరకు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు, కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయిపోయింది. ఇదీ నేటి మన సినిమా పరిస్థితి ” అని పవన్ కల్యాణ్ బెంగళూరులో సూటిగా కామెంట్స్ చేశారు. పర్యావరణ సంబంధిత అంశాలపై అక్కడి ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు బెంగళూరు వెళ్లిన పవన్ కల్యాణ్ సీఎం సిద్ధరామయ్యతో పాటు అక్కడి పర్యావరణ మంత్రితోనూ చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలపై చర్చించి.. తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. మాటల సందర్భంలో ఎర్ర చందనం ప్రస్తావన వచ్చినప్పుడు ఈ కామెంట్స్ చేశారు.
సహజంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే హీరో అంటే గుర్తుకు వచ్చేది పుష్పనే. హీరోచితంగా ఎర్రచందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేయాలో పుష్ప సినిమాలో హీరో చూపిస్తూంటారు. అయినా ఆ పాత్ర పోషించినందుకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అప్పటికీ చాలా విమర్శలు వచ్చాయి. అయినా సినిమా సూపర్ హిట్ కావడంతో అందరూ యాక్సెప్ట్ చేసేశారని అనుకున్నారు. కానీ ఆ సినిమా సమాజంపై చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడేవారూ ఉంటారు.
Also Read : చిత్తూరు రైతుల కోసం బెంగళూరుకు పవన్
కానీ ఎప్పుడూ పవన్ కల్యాణ్ బయట స్పందించలేదు. ఆయన పర్యావరణ మంత్రి కావడం.. ఎర్ర చందన స్మగ్లింగ్ ను అరికట్టాల్సిన బాధ్యతల్లోకి రావడంతో స్పందించక తప్పలేదు. ఆయన అన్న మాటలు.. నేరుగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి కాకపోయినా.. ఇటీవల ఎన్నికల్లో పిఠాపురం రాకండా వైసీపీ అభ్యర్థి ప్రచారం కోసం వెళ్లడంతో చెలరేగిన వివాదం నేపధ్యంలో.. పవన్ మాటలు వైరల్ అవుతున్నాయి.