జనతా గ్యారేజ్..ఇక్కడ అన్నింటికి రిపేర్లు చేయబడును అని ఎన్టీఆర్ సినిమా టైటిల్. దీని ప్రస్తుత పాలిటిక్స్ కు అన్వయించి చూస్తే మరోలా చెప్పొచ్చు.జగన్ గ్యారేజ్ ..ఇక్కడ అవాస్తవాలు అందంగా చెప్పబడును అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు.
అధికారంలో ఉన్నాన్నాళ్ళు అబద్ధాలను వల్లే వేసి పాలన కొనసాగించిన వైసీపీ..ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా వాటినే అస్త్రాలుగా మలుచుకుంటుంది. కానీ, అవి పార్టీని, నేతలను పలుచన చేయడమే కాకుండా, విశ్వసనీయత కోల్పోయేలా చేస్తోంది అన్న సంగతిని మరిచిపోతున్నారు.విషయం ఏంటంటే..జగన్ కు సెక్యూరిటీ కల్పించేందుకు సంకోచిస్తున్నారు.. మరి సీఎం మనవడికి ఆరుగురితో ఎలా సెక్యూరిటీ కల్పిస్తున్నారు అని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని పోలీసులు వెల్లడించారు. దేవాన్ష్ కు ఎలాంటి భద్రత కల్పించడం లేదని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని జగన్ గగ్గోలు పెట్టినా ఏపీలో అలాంటి పరిస్థితి లేదని తన పర్యటన సాఫీగా సాగుతుండటం బట్టి స్పష్టం అవుతోంది. సాధారణ జనాలకు అంటారా వారికేం ఇబ్బంది లేదు..అయినా జగన్ ఈ ఆరోపణలు చేయడం పూర్తి రాజకీయమేనని స్పష్టం అవ్వడమే కాదు..ఆయన మాటలను జనాలు నమ్మని పరిస్థితిని తెచ్చుకుంటున్నారు.
Also Read : వైసీపీకి మరో ఎమ్మెల్సీ షాక్ !?
రాజకీయాల్లో మాట తూలితే ఏం జరుగుతుందో సీనియర్ నేతలకు బాగా తెలుసు. అందుకే సీనియర్లు అన్ని ఆలోచించి మాట్లాడుతారు. విమర్శలు కూడా ప్రత్యర్ధులు ఆలోచింపజేసే విధంగా చేస్తారు కానీ, జగన్ తో సహా వైసీపీ నేతలు తమ మాటలను నమ్మకండి అనే తరహాలో మేసేజ్ ఇస్తున్నట్లుగా అబద్ధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే వైసీపీని ఇక ఆ దేవుడే కూడా కాపాడలేడు!