వైసీపీ నేతల ఇల్లీగల్ ఎఫైర్స్ వ్యవహారాలు హెడ్ లైన్స్ అవుతున్నాయి. అధికారంలో ఉండగా వారు చేసిన దందాల్లో ఇవి కూడా ఉండటంతో అధికారం పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత నెలలో విజయసాయిరెడ్డి వ్యవహారం సంచలనం సృష్టించింది. ఆయన అందరి మీద ఒట్లు వేసి.. నాకేం తెలియదని చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన ఎపిసోడ్ ముగిసిపోలేదు. డీఎన్ఏ టెస్టు దాకా పోయినా ఆశ్చర్యం లేదు. ఆయన వ్యవహారమే అందర్నీ ఆశ్చర్య పరిచేలా చేస్తే .. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరింత ముదిరిన స్టోరీలా మారింది.
దువ్వాడ శ్రీనివాస్ కు పెళ్లయి పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన వయసు కూడా అరవై ఏళ్లకు దగ్గర పడింది. ఇలాంటి సమయంలో ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. అలా చేస్తూ.. సొంత కుటుంబానికి అన్యాయం చేస్తూండటంతో విషయం రోడ్డున పడింది. ఆయన వ్యవహారం మొదటి నుంచి తేడాగా ఉండటంతో మీడియా, సోషల్ మీడియాలో అందరూ హైలెట్ చేశారు. ఆయన కుటంబం కూడా మీడియా ముందుకు వచ్చి నిర్వాకల గురించి బయట పెట్టింది. దువ్వాడతో పాటు ఆయన సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
అయితే వైసీపీలో ఇలాంటి ఘన కార్యాలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారని వారి వ్యవహారాలు వరుసగా బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇప్పుడు వీడియో టేపులు కూడా వస్తాయని టీడీపీ నేతలు లీకులు ఇస్తున్నారు. వచ్చే వారంలో అంబబటి రాంబాబు వైరల్ అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు.