వారంతా దశాబ్దాలుగా రాజకీయం చేసిన వారు. రాజకీయాలు ఆలోచనతో చేయాలని.. తెలిసిన వాళ్లు. వాళ్లంతా ఇప్పుడు జగన్ చేస్తున్న రొడ్డకొట్టుడు రాజకీయంతో నిర్వేదానికి గురవుతున్నారు. తెలియదు.. చెబితే వినరు బాపతు కావడంతో… సైలెంట్ గా ఉండటమే బెటరనుకుంటున్నారు. ఎప్పుడైనా పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చి మీడియాతో మాట్లాడండి అని స్క్రిప్ట్ పంపితే జగన్ తో అనుబంధం ఉన్న ఎమ్మెల్యేలు మాత్రంత తూ తూ మంత్రంగా ప్రెస్ మీట్ పెడుతున్నారు. చాలా మంది అసలు పట్టించుకోవడం లేదు.
ఏపీలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగినట్లుగా ప్రచారం చేసే విషయంలోనూ వైసీపీ సీనియర్లు డిఫర్ అయ్యారు. హడావుడి చేసినంత వరకూ బాగానే ఉంటుందని తర్వాత నిజం తెలుస్తుంది కాబట్టి పరువు పోతుందని భయపడి చాలా మంది జగన్ ప్రచారానికి తమ గొంతు కలపలేదు. ఇప్పుడు అదే జరుగుతోంది . అయితే జగన్ మాత్రం ఒకే స్క్రిప్ట్ ను ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్లతో చట్టసభల్లో చెప్పించి వాళ్లనూ నవ్వుల పాలు చేస్తున్నారు. తన ముఖాన నవ్వుతున్నారని తెలిసినా విజయసాయిరెడ్డి అలా ఎందుకు రాజ్యసభలో మాట్లాడతారు.. జగన్ రెడ్డి నుంచి ఒత్తిడి లేకపోతే.
ప్రజల్ని నమ్మించగలమని.. తాము ఏది చెబితే అది నమ్మేస్తారని అనుకునే జగన్ రెడ్డి మైండ్ సెట్లో మార్పు రాకపోవడంతో… వీలైనంత వరకూ ఆయన రాజకీయానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఫలితంగా వైసీపీ సీనియర్ నేతలెవరూ బయట కనిపించడం లేదు. ఆ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకోవడం లేదు. జగన్ పిచ్చి పాలిటిక్స్ ను ఇదే విధంగా కొనసాగిస్తే.. వారంతా… ఖాళీగా ఉండటమే బెటరని ఫిక్సయ్యే అవకాశం కూడా ఉంది.