మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టుపట్టించారు. వ్యవస్థలని సర్వ నాశనం చేశారు. రాష్ట్రాన్ని తన అక్రమాలకు అడ్డాగా చేసుకున్నారు. తుగ్లక్ రూల్స్ తో రాజ్యంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా పరిపాలన సాగించారు. ముఖ్యమంత్రి పదవిని కేవలం బటన్ నొక్కడానికి పరిమితం చేసి తన ఫ్యూడల్ మెంటాలిటీతో ఆ పదవికే మాయని మచ్చతెచ్చారు.
జగన్ దుష్ట పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయింది. మరో దారుణమైన విషయం ఏమిటంటే.. మానవ సంబంధాలని, విలువలని మంట కలిపేలా జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు ఈ ఐదేళ్ళలో అధికారాన్ని చెలాయించిన తీరు.. వారిని చరిత్ర హీనులుగా ప్రజల ముందు నిలబెడుతోంది. రాష్ట్రాన్ని పాలించండని అధికారాన్ని ఇస్తే.. వైసీపీ నాయకులు అధికారాన్ని అక్రమ సంబంధాల కోసం వాడుకున్న వైనం చూసి ప్రజలు ఇప్పుడు గాండ్రించి వారి ముఖంపై ఉమ్మేస్తున్నారు. వైసిపీ నాయకుల అక్రమ సంబంధాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అవన్నీ సమాజం సిగ్గుపడి తలదించుకునేలా వున్నాయి. గోరంట్ల మాధవ్ నుంచి మొదలుపెడితే.. మొన్న విజయ్ సాయి రెడ్డి, నేడు దువ్వాడ శ్రీనివాస్ వరకూ ఒకొక్కరి కతలు టీవీలో ప్రచారం చేయడానికి, పత్రికల్లో రాయడనికి కూడా ఇబ్బందికరంగా వున్నాయి.
అయితే ఇంత జరుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి ఇంకా కళ్ళు తెరవడం లేదు. తను చేసిన దుర్మార్గమైన పాలనకు ప్రజలు బుద్ధి చెప్పి చిత్తుగా ఓడించినా జగన్ కి ఇంకా జ్ఞానోదయం అయినట్లు కనిపించడం. నాయకుడిగా ఎవరిని సమర్ధించాలో కూడా జగన్ కి తెలియడం లేదు. దువ్వాడ శ్రీనివాస్ ని వెనకేసుకోస్తున్నారు జగన్. ఇదంతా దువ్వాడపై పాలక పక్షం చేస్తున్న కుట్రని లేఖలు విడుదల చేస్తున్నారు.
కన్న కూతుర్ని, కట్టుకున్న భార్యని కొట్టడానికి వెళ్లారు దువ్వాడ. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. దువ్వాడ నన్ను ఉంచుకున్నారని చెబుతోంది మాధురి. దానికి అడల్ట్రీ అని పేరుపెట్టుకుంది. ఈ బాగోతం అంతా యావత్ రాష్ట్రప్రజానీకం చూసింది. కానీ కేవలం జగన్ మోహన్ రెడ్డికే ఇది పాలక పక్షం కుట్రగా కనిపించింది. ఇలాంటి బరి తెగించిన నాయకులని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి సిగ్గు లేకుండా వకాల్తా పుచ్చుకోవడం జగన్ మోహన్ రెడ్డి ముర్ఘత్వానికి అద్దం పడుతోంది.
తన నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన జగన్, పార్టీ నాయకులపై పట్టుకోల్పోయి, అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేసి, సభ్యసమాజం సిగ్గుపడి తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు.
రాష్ట్రానికి కస్టోడియన్ గా ఉండమని ప్రజలు అధికారం ఇస్తే.. తండ్రి స్థానంలో ఉండాల్సిన నాయకులు ప్రజల ప్రాణ, మాన, ఆస్తులని పరిరక్షించాల్సింది పోయి కంచే చేను మేసినట్లు, అధికారాన్ని ఇలాంటి దిక్కుమాలని పనులు వాడుకోవడం ఎంతమాత్రం క్షమార్హం కాదు. ఇలాంటి దుర్మార్గమైన పార్టీలని, నాయకులని శాశ్వతంగా బహిష్కరించాల్సిన అవసరం వుంది.