బీఆర్ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీక్ , గొర్రెల స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ తిరుపతిని మరో వివాదం చుట్టుముట్టింది. రాష్ట్రంలో కొనసాగుతోన్న రెడ్ అంబులెన్స్ ల దోపిడీ వెనక తిరుపతి పాత్ర ఉందంటూ ప్రైవేట్ అంబులెన్స్ అసోషియేషన్ ప్రతినిధులు సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలోని కార్పోరేట్ ఆసుపత్రులన్నీ రెడ్ బుక్ అంబులెన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనక తిరుపతి ఉన్నారని, దీని వలన ప్రైవేట్ అంబులెన్స్ లపై ఆధారపడి జీవిస్తోన్న పదివేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. రెడ్ అంబులెన్స్ సంస్థ సీఈవో ప్రభు దీప్ సింగ్ చైనా ఏజెంట్ అని, కేటీఆర్ పీఏ సహకారంతోనే ఆయన అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.
Also Read : మళ్లీ సార్ ఎప్పుడొస్తారు?
రెడ్ బుక్ అంబులెన్స్ వలన కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుందని, తప్పనిసరి పరిస్థితుల్లో తాము రెడ్ అంబులెన్స్ లో చేరామన్నారు. కానీ ఆ సంస్థ ప్రతి అంబులెన్స్ కు తమ వద్ద నుంచి ఏటా లక్షన్నర వరకు డిమాండ్ చేయడమే కాకుండా, ప్రతి ట్రిప్ నుంచి 40శాతం కమిషన్ వసూలు చేస్తుందన్నారు. ఈ సంస్థ రెచ్చిపోవడం వెనక తిరుపతి ఉన్నారన్నారు. ఈ విషయంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేశామని త్వరలోనే దీనిపై చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు.