మేఘా ఇంజనీరింగ్ ఎవరు అధికారంలో ఉంటే వారికి అత్యంత ఇష్టమైన కంపెనీ. ప్రతిపక్షంలో ఉన్న కంపెనీలకు మాత్రం.. అత్యంత అయిష్టమన కంపెనీ. ఈ విషయం మరోసారి రుజువు అవుతోంది. నిన్నటిదాకా బీఆర్ఎస్ నేతలు మేఘాపై ఈగ వాలనిచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు ఏకంగా ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని రోజూ డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెద్దగా స్పందించడం లేదు.
సుంకేశుల రిటైనింగ్ వాల్ కూలిన వ్యవహారంలో పదే పదే మేఘాను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. రోజూ నేరుగా రాహుల్ గాంధీనే ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. తాజాగా బీజేపీ కూడా అదే పాట అందుకుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మేఘాను బ్లాక్ లిస్టులో పెట్టడం లేదని ప్రశ్నించారు కాంగ్రెసుకు మెఘా ఇంజనీరింగ్ కంపెనీ కామధేనువుగా మారిందని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనతో పాటు ఇతరత్రా మెఘా కంపెనీ తప్పిదాలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని లేకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి విచారణలు చేయాలంటే.. మేఘాపై చాలా ఉంటాయి.అయితే అధికార పార్టీలకు అత్యంత ప్రియమైన మేఘా .. తన పలుకుబడిని కొనసాగిస్తోంది. కొసమేరుపేమిటంటే.. మేఘా కంపెనీను బ్లాక్ లిస్టులో పెట్టాలని లోపభూయిష్టంగా ఆ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై విచారణ చేయించాలన్న డి్మాండ్లను సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ కూడా సమర్థిస్తున్నారు. ముఖ్యమంత్రులు మేఘా కృష్ణారెడ్డి వాళ్లను దగ్గరకు రానివ్వకూడదని..వారి అక్రమాల సంగతి తేల్చాలని ఆయన అంటున్నారు.