మాంద్యం ముంచుకొచ్చేసింది. ఆ విషయాన్ని రిలయన్స్ కూడా గుర్తించింది. అంతా రిలయన్స్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకల గురించి అందరూ చెప్పుకున్నారు. ఈ పెళ్లి వేడుకలు ఏడాదిన్నర పాటు సాగాయి. అయితే.. ఈ వేడుకలుజరుగుతున్న కాలంలో.. ఓ ఏడాది ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ తన ఉద్యోగుల సంఖ్యను 42వేల వరకూ తగ్గించుకుంది. ఉద్యోగుల్ని తీసేస్తున్నామని.. లే ఆఫ్స్ అని ఎప్పుడూ అ కంపెనీ ప్రకటించలేదు. సింపుల్ ప్రాసెస్‌లో పూర్తి చేసింది.
ఇప్పుడు కూడా రిలయన్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవల కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం… 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆ కంపెనీకి 3 లక్షల 89వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చే సరికి వారి సంఖ్య 3 లక్షల 47వేలు మాత్రమే. మరి మధ్యలో ఉన్న 42వేల మంది ఏమయ్యారు ?. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. రిలయన్స్ వాళ్లను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపేసింది.
సహజంగా రిలయన్స్ లాంటి కంపెనీలు వర్క్ ఫోర్స్ తగ్గించుకోవు. క్రమంగా పెంచుకుంటూ పోతాయి. కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో.. ఉన్న వ్యాపారాలను విస్తరించే సమయంలో .. వర్క్ ఫోర్స్ ముఖ్యం.కానీ రిలయన్స్ తగ్గించుకుంది. దీనికి కారణం మాంద్యమేనని నిపుణుల అభిప్రాయం. అంటే తెలియకుండానే మాంద్యంలోకి వెళ్లిపోయింది ఆర్థిక వ్యవస్థ. వేగంగా కోలుకోవాలని ఆశించడమే మిగిలింది.