టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ దంపతులు విడిపోయిన సంగతి తెలిసిందే. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఎవరూ బయటపెట్టకపోవడంతో ఇప్పటికీ అది మిస్టరీగానే ఉండిపోయింది.
అయితే చీటింగ్ కు పాల్పడటమే విడాకులకు కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకు నటాషా వ్యవహారశైలి కారణం అవుతోంది.
ఇన్స్టాగ్రామ్ వేదికగా చీటింగ్, దుర్భాషలాడటం వంటి సంబంధిత రీల్స్‌కు నటాషా లైక్స్ కొడుతుండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. ఇదివరకు ఇలాంటి రీల్స్ కు రియాక్షన్ ఇవ్వని నటాషా, పాండ్యాతో విడిపోయాక చీటింగ్ సంబంధిత రీల్స్ కు లైక్స్ కొట్టడం చర్చనీయాంశం అవుతోంది.
నటాషాను పాండ్యా చీటింగ్ చేయడమే వారి మధ్య దాంపత్య జీవితానికి ఎండ్ కార్డు వేసిందా..? ఈ విషయాన్ని నేరుగా చెప్పలేక పరోక్షంగా చీటింగ్ రీల్స్ కు నటాషా లైక్స్ కొడుతూ లీకులు ఇస్తుందా? అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఇక, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సమయంలోనే పాండ్యా- నటాషా విడిపోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ జులై 18న నటాషా, హార్దిక్ ఇన్ స్టాగ్రామ్‌లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వీరికి అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.