మా టైమ్ వస్తుంది అని ఇప్పుడు వైసీపీ నేతలు కిందా మీదా పడుతున్నారు. వాళ్ల టైమ్ నడిచినప్పుడు పక్కనోళ్లకి కూడా ఓ టైమ్ వస్తుందని ఊహించడానికి.. ఆలోచించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ముఫ్పై ఏళ్ల పాటు మాకు తిరుగులేదన్న అహంభావంతో విర్రవీగిపోయారు. ఇళ్ల మీదకెళ్లారు. ఆడవాళ్ల మీదకెళ్లారు. తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించారు. చివరికి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.
అగ్రిగోల్డ్ వ్యవహారంలో కొడుకు పేరుతో కబ్జా చేసింది కొడుకును జైలుకు పంపేలా చేసింది జోగి రమేష్ . అమెరికాలో చదువుకు వచ్చాడని గప్పాలు కొట్టుకునే బదులు.. అసలు కొడుకు పేరు మీద అగ్రిగోల్డ్ స్కాం ఎందుకు చేయాల్సి వచ్చిందో విశ్లేషించుకుంటే బెటర్. అధికారంలో ఉన్నప్పుడు అధికారులు చెప్పిన పని చేస్తారని స్కాములకు పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఎదురొస్తాయి. ఇలాంటి కేసుల్లో కూడా ప్రతిపక్ష నేతలన్న కారణాంగా ఎవరైనా వదిలేస్తారా ?.
ఇవేమీ పోలీసులు చేసిన ఫిర్యాదులు కాదు.. వైసీపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదులు కాదు.. అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసిన ఫిర్యాదులే. అందుకే కేసులు పెట్టారు. చట్ట పరంగా అన్ని డాక్యుమెంట్లు విశ్లేషించి డీజీపీకి రిపోర్టు ఇచ్చిన తరవాతనే కేసు నమోదయింది. ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు అనే ప్రశ్న రాకుండా చూసుకున్నారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు.. కేసు ఏదో తెలియకుండా అరెస్టు చేసి తీసుకుపోవడం….. తర్వాత ఎప్పటికో ఎఫ్ఐఆర్ బయట పెట్టడం. ఇదే తంతు. పైగా ధర్డ్ డిగ్రీ మరో వికృత ప్రక్రియ.
ఇది మామూలు కేసే.. అసలు ట్రీట్ మెంట్ ఇంకా టీడీపీ ప్రారంభించలేదు. దానికి ఇంకా సమయం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.