రాజకీయం అంటే ప్రత్యర్థితో సవాళ్లు చేసుకుని తనతో సమానమన్న పరిస్థితిని కల్పించడం కాదు. లేనిపోని ఎలివేషన్స్ వచ్చేలా దుందుడుకు చర్యలు తీసుకోవడం లేదు. రాజకీయం అంటే సుతిమెత్తగా .. తెలియకుండా కొట్టడం.. కొట్టించుకునేవాడికి కూడా తెలియకుండా పాతాళానికిపోయేలా చేయడం., అలంటి వింటేజ్ పాలిటిక్స్ చేసేవారు అరుదు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న రాజకీయం అదే. ఆవేశంలో కంటికి కన్ను ..పంటికి పన్ను అని అందరూ అంటున్నారు కానీ అలంటి చర్యలు తీసుకుంటే లాభపడేది అంతిమంగా ఎవరో ఆలోచిస్తే .. చంద్రబాబు చేస్తున్న రాజకీయం ఎంత పర్ ఫెక్టో అర్థమవుతుంది.
చంద్రబాబుకు ఇతరులకు అదే తేడా !
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రెండు నెలలు దాటిపోయింది. ఒక్క వైసీపీ కార్యకర్తను కానీ.. ఒక్క లీడర్ ను కానీ జైలుకు పంపలేదు… అదే జగన్ మరోసారి గెలిచి ఉంటే చంద్రబాబు, లోకేష్ సహా ఎవర్నీ వదిలి పెట్టి ఉండేవారు కాదు అనేది… కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్న. జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. వ్యవస్థలను గరిష్టంగా దుర్వినియోగం చేసి చేయగలిగినంత తప్పులు చేశారు. మళ్లీ గెలిచినా ఆయన అంతకు మించి చేయగలిగిందేమీ లేదు. మనుషుల్ని చంపడం లేదా జైళ్లలో పెట్టడమే రాజకీయం అయితే.. ఇప్పటి వరకూ ప్రజాస్వామ్యం నిలబడి ఉండేదే కాదు. ఈ సూక్ష్మం తెలిసిన వారు మాత్రం.. చంద్రబాబు చేస్తున్న సాఫ్ట్ పాలిటిక్స్ ప్రభావం గురించి నమ్ముతున్నారు.
Read Also : సజ్జల సేవలకు జగన్ ముగింపు పలకనున్నారా?
ఎవరినైనా వదిలేసే అవకాశం ఉంటుందా ?
జగన్ రెడ్డి లాంటి రాజకీయాలు చేయాలనుకుంటే.. దానికి చంద్రబాబు ఎందుకు ?. అధికారం ఉంది కదా అని వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడేసి.. అందర్నీ అరెస్టులు చేయిస్తే.. ఏమొస్తుంది ?. ఓట్లు వేసే ప్రజలు అధికార దుర్వినియోగాన్ని అసలు సహించరు. ఆ విషయం ఎన్నికల ఫలితాలోనే నిరూపితమయింది. అందుకే చంద్రబాబు.. మొదటి నుంచి ఒకటే చెబుతున్నారు… చట్ట పరిధిలోనే చర్యలు అని. వైసీపీ నేతలు .. వారికి ఊడిగం చేసిన వారు చేసిన తప్పులు.. తొలగిస్తే పోయేవి కావు. ఫైళ్లు కాల్చేస్తే మాయమయ్యేవి కావు. చాలా పకడ్బందీగా వారిని బోనెక్కించేదుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో సందేహమే ఉండదు. అది అధికారంలోకి రాగానే చేస్తే ప్రజల్లోకి వెళ్లే భావన వేరు.
వైసీపీ నేతలు రోడ్ల మీద కనిపించడానికి ఎందుకు భయపడుతున్నారు ?
ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరూ రోడ్ల మీదకు రాలేకపోతున్నారు. ఎందుకు ?. పుంగనూరు పెద్దిరెడ్డి హైదరాబాద్‌లో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధాన మీడియాతో మాట్లాడే ధైర్యం లేక ఓ యూట్యాబ్ చానల్‌తో మాట్లాడి… సర్దుకున్నారు . నెంబర్ 2గా చెలామణి అయిన ఆయనే అలా బిక్కుబిక్కుమంటూంటే మిగతా వారి పరిస్థితి ఏమిటి?. ఇటీవల నోరు తెరిచిన కొంత మంది..ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు. తెర వెనుక చంద్రబాబు మార్క్ రాజకీయాలు చాలా జరుగుతున్నాయి. అవి వైసీపీ నేతలకు ఇప్పుడే ఊపిరాడనీయడంలేదు. ముందు ముందు ఈ రాజకీయం ఎలా ఉంటుందో వారికీ తెలియక టెన్షన్ పడుతున్నారు.