నేను లోకల్ అంటూ దానం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఇంతెత్తన లేచారు.. ఎందుకంటే ఆయనపై కేసు పెట్టారు రంగనాథ్. అధికారులు వస్తారు పోతారని.. ఆయన గురించి సీఎంకు చెబుతానని దానం ఫైర్ అయ్యారు. అయితే సీఎంకు తెలియకుండా ఓ ఎమ్మెల్యేపై అదీ కూడా.. ఫిరాయించి మరీ తన పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేపై కేసు పెట్టడం నమ్మశక్యంగా లేదని.. ఖచ్చితంగా సీఎంకు తెలిసే కేసు పెట్టి ఉంటారని… ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భావిస్తున్నారు.
ఇక్కడ దానం నాగేందర్‌కు అవమానం జరిగిందా.. పార్టీ మారి కాంగ్రెస్ కు మద్దతిచ్చినందుకు బాగా బుద్ది వచ్చేలా చేశారా అన్నది మ్యాటర్ కాదు.. కానీ పార్టీలోకి వచ్చినంత మాత్రాన అడ్డగోలు పనులు చేస్తే.. ప్రోత్సహించే అవకాశమే ఉందని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సందేశాన్ని మాత్రం నేరుగా పంపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌లో చేరే వారు రకరకాలుగా తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అధికార అడ్వాంటేజ్ ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారి అత్యుత్సాహం వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే కఠినంగా వ్యవహరించాలని రేవంత్ నిర్ణయించారు.
Read Also : హైదరాబాద్ రియాల్టీకి సెక్యూరిటీ హైడ్రా !
ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చినంత మాత్రాన అడ్వాంటేజ్ తీసుకుంటామంటే సాధ్యం కాదని.. చట్ట పరంగా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమే కానీ.. చట్ట విరుద్ధంగా చేసే పనులకు ప్రభుత్వం అండ ఉంటుందని భావించవద్దని నేరుగా నే సంకేతాలు పంపినట్లయింది. ప్రజలు కూడా ఇదే కోరుకుంటారు. ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ప్రధానంగా పార్టీ నేతల వ్యవహారశైలి వల్లే వస్తుంది. తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్ని పీడిస్తూంటారు. అలాంటి సమస్యలు రాకుండా రేవంత్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.