ఎన్టీఆర్ అభిమానులకు షాకింగ్ వార్త. ఆయన మణికట్టుకు గాయమైంది. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు తేల్చారు. విషయం ఏమిటంటే.. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ జిమ్ లో కసరత్తు చేస్తుండగా మణికట్టు దగ్గర గాయమైంది. వెంటనే ఆయన చికిత్స తీసుకొన్నారు. ఎన్టీఆర్ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు ఆయనకు విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు. కనీసం రెండు మూడు వారాల పాటు ఆయన షూటింగులకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
Also read : ఒక్క పాటతో ‘దేవర’ కలర్ మారిపోయిందే..!
అయితే ఈ గాయం ప్రమాదకరమైనది కాదని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ టీమ్ ప్రకటించింది. మంగళవారం సైతం ఆయన ‘దేవర’ షూటింగ్ లో పాలు పంచుకొన్నారని, ‘దేవర’కు సంబంధించి తన పార్ట్ పూర్తి చేశారని పీ.ఆర్ టీమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’తో పాటుగా ‘వార్ 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వార్ 2’కు సంబంధించి ఓ కీలకమైన షెడ్యూల్ బాకీ ఉంది. దాంతో పాటుగా ఇటీవలే ప్రశాంత్ నీల్ సినిమాకు సైతం కొబ్బరి కాయ కొట్టారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది.