ప్ర‌భాస్ ‘ఫౌజీ’.. ప్లానింగ్ ఇదే!

ప్ర‌స్తుతం ‘రాజాసాబ్‌’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. దాంతో పాటు ‘ఫౌజీ’ని కూడా మొద‌లు పెట్ట‌బోతున్నాడు. ఈనెల 17 న ‘ఫౌజీ’ లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఆరోజే టైటిల్ ని కూడా అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

నిజానికి ఈనెల 18 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లు కావాలి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం అవుతోంది. వ‌చ్చే నెల నుంచి త‌మిళ నాడులో ఓ షెడ్యూల్ ప్రారంభిస్తారు. ప్ర‌భాస్ కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ని ఎంచుకొనే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే మృణాల్ మాత్రం ఈ సినిమాలో ప‌ని చేయ‌డం లేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు త్రిష పేరు కూడా గ‌ట్టిగా వినిపిస్తోంది. ప్ర‌భాస్ – త్రిష‌ల‌ది సూప‌ర్ హిట్ కాంబో. ‘వ‌ర్షం’లో ఇద్ద‌రూ జోడీగా న‌టించారు. అది ప్ర‌భాస్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన ‘బుజ్జిగాడు’ కూడా అంద‌రికీ న‌చ్చింది. మ‌ధ్య‌లో ‘పౌర్ణ‌మి’ కాస్త నిరాశ ప‌రిచినా, ప్ర‌భాస్ – త్రిష‌ల కెమిస్ట్రీ అందులో కూడా బాగా వర్క‌వుట్ అయ్యింది. అందుకే మ‌రోసారి త్రిష వైపే మొగ్గు చూపే అవ‌కాశాలు ఉన్నాయి. స్వాతంత్యం రాక ముందు జ‌రిగే క‌థ ఇది. ప్ర‌భాస్ బ్రిటీష్ సైనికుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close