మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత కత్తి వేలాడుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా వాటిని ఎన్నికల ఆఫిడవిట్ లో పేర్కొనలేదని , పెద్దిరెడ్డి ఎన్నిక చెల్లదంటూ టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా..విచారణ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
పెద్దిరెడ్డి తన ఎన్నికల ఆఫిడవిట్ లో తన భార్య పేరిట ఉన్న 500 గజాల స్థలంతోపాటు మరికొన్ని ఆస్తులను ఆఫిడవిట్ లో పేర్కొనలేదని హైకోర్టులో చల్లా రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరగగా… ఎన్నికల నిబంధనలను పెద్దిరెడ్డి ఉల్లంఘించారన్నారు రామచంద్రారెడ్డి తరఫు న్యాయవాదులు.
ఈ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పెద్దిరెడ్డిపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో చెప్పాలని ఆయన తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇదే సమయంలో పుంగనూరు నుంచి పోటీ చేసిస అభ్యర్థులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అనంతరం విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు..ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.