ఏపీలో గంజాయిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆ విభాగానికి చీఫ్ గా ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణను నియమించారు. ఆయన కొంత కాలంగా కేంద్ర పరిధిలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నారు. ఏపీ క్యాడర్ కు చెందిన ఆయన .. సమర్థమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరోలో డిప్యూటేషన్ ముగించుకుని ఏపీకి తిరిగి వస్తున్నారు.
ఐజీ ర్యాంక్ లో ఉన్న ఆయనకు ప్రభుత్వం .. డిప్యూటేషన్ నుంచి రాగానే కీలకమైన పోస్టు అప్పగించింది. ఆకే రవికృష్ణ ఎక్కడ పని చేసినా తనదైన ముద్ర వేస్తూంటారు. గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే అక్కడి నక్సల్స్‌లో మార్పులుతెచ్చేందకు.. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో పనిచేస్తే అక్కడి ఫ్యాక్షనిస్టుల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించారు. గతంలో కప్పట్రాళ్లలో ఆయన ఫ్యాక్షన్ ను తగ్గించి అందిరకీ ఉపాధి పెంచేందుకు తనదైన చర్యలు తీసుకన్నారు.
తర్వాత టీటీడీలో విజిలెన్స్ చీఫ్ గా కూడా పని చేశారు. ఆయన పనితీరుపై చంద్రబాబుకు పూర్తి నమ్మకం ఉంది. గంజాయి మాఫియాను మూలాల నుంచి అరికట్టడానికి ఆకే రవికృష్ణ తనదైన వ్యూహాలను అమలు చేస్తారని. సాగు చేసే వారిలో మార్పు తెచ్చి.. వ్యాపారులను కటకటాల వెనక్కి పంపుతారని భావిస్తున్నారు. గంజాయిని ఎంత కట్టడి చేస్తే.. తెలుగు యువతకు ఇంకా చెప్పాలంటే.. దేశంలో యువతకు చాలా మేలు చేసినట్లే. ఎందుకంటే.. దేశంలోని అత్యధిక మొత్తంలో గంజాయి విశాఖ మన్యం నుంచే సరఫరా అవుతోంది.