ఆ విషయంలో రేవంత్ ను బీఆర్ఎస్ అభినందిస్తోందా?

అవును.. సీఎం రేవంత్ రెడ్డిపై పదేపదే విమర్శలు చేస్తోన్న బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు మాత్రం లోలోపల ఓ విషయంలో రేవంత్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అంటూ చర్చ జరుగుతోంది. దానంపై కేసు విషయంలో రేవంత్ నిర్ణయం పట్ల కాంగ్రెస్ నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నా, బీఆర్ఎస్ మాత్రం ఖుషీ, ఖుషీగా ఉండవచ్చు అంటున్నారు.

బీఆర్ఎస్ ను వీడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ లో చేరారో కానీ, ఆయనకు ఇటీవల బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్ లోని ప్ర‌భుత్వ స్థ‌లం కాంపౌండ్ ను కూల్చివేసిన ఘ‌ట‌న‌పై అందిన ఫిర్యాదుతో దానంపై హైడ్రా కేసు న‌మోదు చేసింది. దీనిపై హైడ్రా చీఫ్ పై దానం గరంగరం అయ్యారు. అధికార పార్టీ నేత అయినప్పటికీ నిబంధనలకు అతీతంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేయాలనే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

ఈ పరిణామం పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ లోలోపల హర్షం వ్యక్తం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన దానంకు తగిన శాస్తి జరిగిందని, పైగా ఇది బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కూడా అవుతుందన్న ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఎందుకంటే..గ్రేటర్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలపై భూఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హైడ్రా దూకుడుతో వారంతా అధికార పార్టీలో చేరినా ప్రయోజనం ఉండదని దానం ఎపిసోడ్ తో అంచనాకు వస్తారని, తద్వారా గ్రేటర్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడరని అ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌ను ట్రోల్ చేస్తోంది ఆ పార్టీ సోషల్ మీడియానే !

బీఆర్ఎస్ సోషల్ మీడియాకు తప్పు ఏదో.. ఒప్పు ఏదో తెలియడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ఆ విమర్శల్లో అయినా కనీస లాజిక్ ఉండాలని...

శ్రీవారి లడ్డూ వివాదం : క్షమాపణలు చెప్పడమే వైసీపీకి మంచిది !

తిరుపతి లడ్డూ వివాదం వైసీపీని నిలువనా దహించి వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరభారతంలో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుసుకుంటే వైసీపీ నేతలకు...

క్యూలో ఉన్న నేతల జాబితా చాలా పెద్దదే !

కూటమి పార్టీల్లో చేరిపోవాలనుకునే వైసీపీ నేతల జాబితాల చాలా పెద్దగా ఉంది. అయితే చేరికలకు ఓ ప్రక్రియ పెట్టుకవడంతో వచ్చిన వారందర్నీ చేర్చుకోవడం లేదు. అన్ని పార్టీల నుంచి కలిసి...

మార్పు గమనించారా – ఏపీలో ఇప్పుడు బూతుల్లేవు !

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజకీయాల్లో బూతులు కామన్. అవి లేకపోతే అసలు రాజకీయ స్పీచ్‌లే ఉండేవి కాదు. అది అసెంబ్లీ అయినా సరే.. జనాల చెవులకు పట్టిన తుప్పును వదలగొట్టేవాళ్లు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close