స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో మాచర్లది ఓ చరిత్ర. ఎలాంటి చరిత్ర అంటే.. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఎవర్నీ పోటీ పెట్టకుండా.. పోటీ చేయకుండా చేసి వైసీపీ గెలిచిన చరిత్ర. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అక్కడ జరిగిన అరాచకాలకు లెక్కే లేదు. 31 వార్డులు ఉంటే మొత్తం ఏకగ్రీవం అయ్యాయి. మొదటి రెండేళ్లు బుద్దా వెంకన్న , బొండా ఉమలపై హత్యాయత్నం చేసిన తురక కిషోర్‌కు పదవి ఇచ్చారు. తర్వాత వేరే పదవి ఇచ్చి … మరో వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారు.
ఇప్పుడు మాచర్లలోనే కాదు.. రాష్ట్రం మొత్తం వైసీపీ ఓడిపోవడంతో.. ఏకగ్రీవమైన మున్సిపల్ కౌన్సిలర్లు అంతా పోలోమని టీడీపీ బాట పట్టారు. చైర్మన్, వైస్ చైర్మన్ కూడా అదే బాటలో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చినా మాచర్లలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు . ఆయన సోదరుడు.. దాడులకు నేతృత్వం వహించే రౌడీలకు నాయకుడు పరారీలో ఉన్నారు. తురక కిషోర్ కూడా ఆయనతో పాటే పరారీలో ఉన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించిన మాచర్లలోని వైసీపీ నేతలు చాలా మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీకి అక్కడ దిక్కు లేకుండా పోయింది. కండ బలంతో.. రౌడీ బలంతో ఏకగ్రీవం అయితే చేసుకోగలిగారు కానీ.. పవర్ లేకపోతే.. వారెవరూ తమతో పాటు ఉండరని ఇప్పుడు వైసీపీ నేతలకు అర్థమైపోయి ఉంటుంది. రాజకీయాన్ని రాజకీయంలాగే చేయాలి కానీ.. రౌడీయిజంతో చేస్తే ఇదే పరిస్థితి.