ఏపీకి ఏ మాత్రం మంచి జరిగినా వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఏపీ ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా నాకేయడమే కాకుండా ఇబ్బడిమబ్బడిగా అప్పులు చేసి పోయింది జగన్ ప్రభుత్వం. చంద్రబాబునాయుడు మెల్లగా వ్యవస్థలను దారిలో పెడుతూ వస్తున్నారు. వీలైనంత వరకూ ప్రభుత్వంపై భారం పడకుండా చాలా వరకూ విరాళాలతో కొన్ని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది వైసీపీకి నొప్పిగా అనిపిస్తోంది.
అన్న క్యాంటీన్ల భారం ప్రభుత్వంపై పడకుండా పెద్ద ఎత్తున వస్తున్న విరాళాలతో వైసీపీకి నిద్రపట్టడం లేదు. విరాళాలు తీసుకుని పథకం అమలు చేస్తున్నారని కొత్తగా విమర్శలు చేస్తున్నారు. ఒక్క అన్న క్యాంటీన్లకే కాదు ప్రభుత్వం ప్రతి పనిలోనూ సహకరించే వారి నుంచి విరాళాలు తీసుకునేందుకు రెడీ అయింది. అందు కోసం జన్మభూమి 2 ను కూడా ప్రారంభించబోతున్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచనున్నారు.
ఇలా చంద్రబాబు అడగడమే ఆలస్యం చాలా మంది కోట్ల రూపాయల విరాళాలివ్వడం.. వైసీపీకి నచ్చడం లేదు. ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందో అని వారు కంగారు పడిపోతున్నారు. కొత్త కొత్త ఆరోపణలతో తెరపైకి వస్తున్నారు. కానీ గతంలోలా వైసీపీని నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కూడా వైసీపీ కుట్రలను అర్తం చేసుకుంటున్నారు.