డైరెక్టర్ హను రాఘవపూడికి కొత్త హీరోయిన్స్ తో పని చేయడం కొత్త కాదు. సాయి పల్లవి తప్పితే ఆయన దాదాపుగా కొత్త హీరోయిన్స్ తోనే వర్క్ చేశారు. లావణ్య త్రిపాఠి, మెహరీన్, మృణాల్ ఠాకూర్ లని తెలుగులో హనునే పరిచయం చేశారు. ఇందులో మృణాల్ ఠాకూర్ పెద్ద స్టార్ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నారు హను. ఈ రోజే కొబ్బరికాయ్ కొట్టారు.
ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వీ నటిస్తోంది. ప్రభాస్ సినిమాలో హీరోయిన్ అంటే చాలా స్పెషల్. పేరు ఎక్కడా విన్నట్లులేదు..ఈమె ఎవరనే సందేహం రావచ్చు. ఇమాన్వీ సోషల్ మీడియా స్టార్. ఇన్స్టా గ్రామ్, యూట్యూబ్ లో ఇమాన్వీ రీల్స్ పాపులర్. ముఖ్యంగా ఆమె చేసిన డ్యాన్సులు వైరల్ అయ్యాయి. అలా హను ద్రుష్టిలో పడింది.
హను సినిమాల్లో హీరోయిన్ కి చాలా ప్రాధాన్యత వుంటుంది. నటించే అవకాశం దొరుకుతుంది. సీతగా మృణాల్ ప్రేక్షకులు గుర్తుండిపొయిందంటే అది హను క్రియేట్ చేసిన క్యారెక్టర్, మృణాల్ యాక్టింగ్. అయితే ఇమాన్వీకి నటనలో ప్రవేశం లేదు. మృణాల్ సీతారామం చేసేముందు హిందీ పరిశ్రమలో చాలా కష్టపడింది. చిన్న చిన్న రోల్స్ నుంచి టీవీ సీరియల్స్ కూడా చేసింది. అవన్నీ ఆమెకు ప్లస్ అయ్యాయి.
ఇమాన్వీకి మాత్రం అలాంటి అనుభవం ఏమీ లేదు. ప్రభాస్ కు జోడిగా ఎలా కనిపిస్తుందో అనే క్వశ్చన్స్ మార్క్ వుంది. అయితే హను హీరోయిన్స్ విషయంలో చాలా పర్టిక్యులర్. ఆడిషన్స్, లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ చేసి వుంటారు. సో.. హీరోయిన్ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదనే చెప్పాలి.