పంద్రాగస్ట్ కి వచ్చిన సినిమాలన్నిటిలో యునానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ‘ఆయ్’. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ లాంటి యువనటులతో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులని కితకితలు పెట్టగలిగింది. చూసిన ఆడియన్స్ హ్యాపీగా థియేటర్ నుంచి వస్తున్నారు. అయితే ఈ విజయం వెనుక బన్నీవాసు ముందు చూపు వుంది.
ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు వచ్చిందట. సీన్లు అన్నీ బావున్నాయి. అలానే వుంచేద్దామని యూనిట్ లో కొందరు భావించారు. కానీ బన్నీవాసు కత్తెరకు పని చెప్పారు. దాదాపు నలభై నిముషాలు ట్రిమ్ చేశారు. దీంతో సినిమా చాలా షార్ఫ్ అయ్యింది. నిజానికి చాలా మంచి నిర్ణయమిది. సీన్లు ఎంత బావున్నా కొత్త నటీనటులు అన్నప్పటికీ ప్రేక్షకులు ఎదోచోట బోర్ ఫీల్ అయ్యే అవకాశం వుంది. ఈ సమస్యని ముందే పసిగట్టిన బన్నీవాసు డిలేట్ చేయడానికే మొగ్గుచూపారు. ఇది బాగా వర్క్ అవుట్ అయ్యింది. నిజానికి ఇప్పుడున్న రన్ టైం సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయింది.
అన్నట్టు.. సినిమాకి హిట్ టాక్ రావడంతో డిలీట్ చేసిన సీన్స్ అన్నీ మళ్ళీ యాడ్ చేసే ఆలోచనలో వుంది టీం. ‘ఆయ్ డి’ పేరుతో జతచేయాలని చూస్తున్నారు. అది థియేటర్స్ వెర్షన్ లో వేస్తారా లేదా నేరుగా ఓటీటీకి యాడ్ చేసి ఇస్తారో చూడాలి.