ఏపీలో వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్‌ల విషయంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఐపీఎస్‌లు జగన్ సర్వీస్ లో మునిగి తేలారని అందరికీ తెలుసు. కానీ ఆ సర్వీసులో భాగంగా వారు చేసిన ఘన కార్యాల గురించి బయటకు తెలిసింది పది శాతమేనని.. కానీ టీడీపీ పెద్దలకు , ప్రభుత్వంలో ఉన్న వారికి మాత్రమే తెలిసిన ఘోరమైన పనులు మరో 90 శాతం ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై పక్కా ఆధారాలు కూడా ఉన్నాయని.. సమయం, సందర్భం బట్టి బయటకు వస్తాయని.. ఎవర్నీ వదిలి పెట్టే అవకాశం లేదని చెబుతున్నారు.
ముఖ్యంగా ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయలు చేసిన పనులను తెలుసుకుంటే.. టీడీపీ కార్యకర్తలకు రక్తం మరిగిపోతుందని… ఆయన గురించి బయటకు తెలిసింది చాలా తక్కువేనని అంటున్నారు. అందుకే ప్రభుత్వం ఓడిపోగానే ఆయన చంద్రబాబుకు క్షమాపణలు చెప్పేందుకు ఎలాగైనా కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అవకాశం దక్కలేదు. చంద్రబాబు కుటుంబంపై అత్యంత ఘోరమైన కుట్రలు చేశారని.. చివరికి చంద్రబాబుపై రాళ్ల దాడులు.. ఎక్కడ ఎలా చేయాలో కూడా ఆయనే ప్లాన్ చేశారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. 70 ఏళ్లు దాటిన చంద్రబాబుకు.. ఒక్క రాయి ఎక్కడ తగిలినా అది ప్రాణాంతకం అవుతుందని తెలిసి కూడా నందిగామ, మార్కాపురం, ఆంగళ్లులో ప్లాన్ చేశారని అంటున్నారు.
మిగతా ఐపీఎస్‌లు టీడీపీ నేతలపై.. లోకేష్‌పై చేసిన కుట్రల గురించి పూర్తి సమాచారం బయట ప్రపంచానికి తెలియదు. అవి తెలిస్తే వారు ఐపీఎస్‌లుగా తమకు ఉన్న అధికారాల్ని ఎంత ఘోరంగా.. రాజకీయ బాసుల కోసం దుర్వినియోగం చేశారో తెలుస్తుంది. అన్నింటినీ ఒకే సారి బయటపెడితే ప్రయోజనం ఉండదని.. సందర్భాన్ని చూసి.. ఒక్కో ఐపీఎస్ కథ బయట పెట్టి.. సరైన శిక్ష వేస్తారని అంటున్నారు.