శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇప్పుడున్న 30 కంపెనీలకు తోడు శ్రీసిటీలో మొత్తంగా 220కంపెనీలు పెట్టేందుకు అవకాశం ఉందని, అందుకు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని సీఎం ప్రకటించారు.
గతంలో హైటెక్ సిటీని పీపీపీ మోడల్ లో మొదలుపెట్టాం… సక్సెస్ అయ్యాం… ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన భారతీయులుంటారు, అందులో ఒక్కరైన తెలుగువారుంటారు అని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకు కారణం అప్పుడు తీసుకున్న నిర్ణయాలేనని, ఇప్పుడు తీసుకోబోయే చర్యలు భవిష్యత్ లో ఏపీని ముందుకు తీసుకువెళ్తాయన్నారు సీఎం.
శ్రీసిటీలో 8వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. ఆటోమేటివ్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు వస్తున్నాయి… మొత్తంగా 4.5 బిలియన్ డాలర్ల పెట్టబడులు రాగా, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించటం గొప్ప విషమన్నారు సీఎం.
ఏపీలో కొనసాగుతున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో పాటు గుడ్ గవర్నెన్స్ కారణంగా వస్తున్న కంపెనీలు ఇక ముందు కూడా కొనసాగేలా చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హమీ ఇస్తోంది.