దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ మీద ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి.తన భార్యా, పిల్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు.
భార్య దువ్వాడ వాణి , కుమార్తె హైందవిలు రోజుల తరబడి ఇంటి దగ్గర ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దువ్వాడ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వాణి, హైందవిలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారని, వారికి నోటీసులు కూడా ఇచ్చారని తెలిపారు.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
మరోవైపు..దువ్వాడ శ్రీనివాస్ కు దివ్వెల మాధురి ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. బిడ్డల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని దువ్వాడ శ్రీనివాస్ ను మాధురి నుంచి కాపాడాలంటూ దువ్వాడ వాణి డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.